Monday, December 23, 2024

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -

ముంబై: స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఐదు సెషన్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 334.98 పాయింట్లు లేక 0.55 శాతం పడిపోయి 60506.90 వద్ద, నిఫ్టీ 89.40 పాయింట్లు లేక 0.50 శాతం పడిపోయి 17764.60 వద్ద ముగిసింది. 1850 షేర్లు లాభపడగా, 1653 షేర్లు నష్టపోయాయి, 185 షేర్లు లాభనష్టాలు లేకుండా యథాతథంగా ముగిశాయి.

నిఫ్టీలో డివీస్ లాబొరేటరీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, జెఎస్ డబ్లు స్టీల్, టాటా స్టీల్, కొటక్ మహీంద్ర బ్యాంక్ ప్రధానంగా నష్టపోగా, అదానీ పోర్ట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బిపిసిఎల్, హీరో మోటార్ కార్పొరేషన్, అపోలో హాస్పిటల్స్ లాభపడ్డాయి. ఇక రంగాల వారీగా చూసినట్లయితే మెటల్, పవర్ సూచీలు 1 నుంచి 2 శాతం వరకు నష్టపోయాయి. కాగా క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసిజి, రియాలిటీ రంగాలు 0.5 శాతం చొప్పున నష్టపోయాయి. ఇదిలా ఉండగా మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం మేరకు పెరిగాయి. ఇక డాలరు మారకం విలువ రూపాయితో పోల్చినప్పుడు 0.90 పైసలు లేదా 1.10 శాతం పెరిగింది. ఒక్క డాలరు విలువ ప్రస్తుతం రూ. 82.74గా ఉంది. ఇక బంగారం ధర రూ. 486.00 లేక 0.86 శాతం పెరిగి రూ. 57071.00 వద్ద ట్రేడయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News