- Advertisement -
ముంబై: బెంచ్ మార్క్ స్టాక్ సూచీలు కనిష్ఠ స్థాయిలో ముగిశాయి. వోలాటిలిటీ బాగా పెరిగింది. దాంతో మాంద్యం నెలకొన్నట్లయింది. సెన్సెక్స్ 609.28 పాయింట్లు లేక 0.81 శాతం పతనమై 73730.16 వద్ద ముగియగా, నిఫ్టీ 150.40 పాయింట్లు లేక 0.67 శాతం పతనమై 22419.95 వద్ద ముగిసింది. నిఫ్టీ 50లో ప్రధానంగా లాభపడిన షేర్లు టెక్ మహీంద్ర, దివీస్ లాబ్స్, ఎల్ టి మైండ్ ట్రీ, బజాజ్ ఆటో, ఇక ప్రధానంగా నష్టపోయిన షేర్లలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఉన్నాయి. మారుతి సుజుకీ లాభాలు ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికగా 48 శాతం పెరిగి రూ. 3878 కోట్లు నమోదయింది. ట్యాక్స్ తర్వాత లాభాలు (పిఎటి) బాగుండడంతో షేరుకు రూ. 125 డివిడెండ్ ప్రకటించింది.
- Advertisement -