- Advertisement -
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. బిఎస్ఇ సెన్సెక్ 736 పాయింట్ల నష్టంతో 72,012 వద్ద ముగిసింది. నిఫ్టీ 238 పాయింట్ల నష్టంతో 21,817 వద్ద ముగిసింది. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్, నెస్లే షేర్లు 3 శాతం చొప్పున క్షీణించాయి. నిఫ్టీ బ్యాంక్ 191 పాయింట్లు పతనమై 46,384 వద్ద, నిఫ్టీ మిడ్‌క్యాప్ 575 పాయింట్లు క్షీణించి 45,926 వద్ద ఉన్నాయి. పేటిఎం షేర్లు మంగళవారం 5 శాతం లాభాన్ని పెంచుకున్నాయి. ఒక్కో షేరుకు రూ. 405.85 వద్ద స్థిరపడ్డాయి. కాగా, బ్యాంక్ ఆఫ్ జపాన్ 17 ఏళ్లలో తొలిసారిగా వడ్డీ రేట్లను పెంచింది. నిఫ్టీలో ఒఎన్‌జిసి, అదానీ ఎంటర్‌ప్రైజెస్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఐటిసి వంటి ముఖ్యమైన లాభపడగా, టిసిఎస్, విప్రో, టాటా స్టీల్, బిపిసిఎల్, కోల్ ఇండియాలు ప్రధాన నష్టాల్లో ఉన్నాయి.
- Advertisement -