Thursday, November 14, 2024

953 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

- Advertisement -
- Advertisement -
Sensex
7,000 వద్ద ముగిసిన నిఫ్టీ
ఐటి మినహా అన్ని రంగాలు రెడ్‌లో ముగిశాయి

ముంబై: ఐటి మినహా అన్ని రంగాల షేర్ల అమ్మకాల మధ్య నిఫ్టీ 17,000 దగ్గర ముగిసింది. సెప్టెంబర్ 26 న భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా నాల్గవ సెషన్‌లో కూడా నష్టాల్లో ముగిశాయి.ముగింపులో, సెన్సెక్స్ 953.70 పాయింట్లు లేదా 1.64% క్షీణించి 57,145.22 వద్ద,  నిఫ్టీ 311 పాయింట్లు లేదా 1.79% క్షీణించి 17,016.30 వద్ద ఉన్నాయి. దాదాపు 630 షేర్లు లాభపడగా, 2860 షేర్లు నష్టపోయాయి, 120 షేర్లు తటస్థంగా ఉండిపోయాయి.

నిఫ్టీలో టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, ఐషర్ మోటార్స్ ప్రధానంగా నష్టపోయాయి. కాగా   హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, డివిస్ ల్యాబ్స్ , అల్ట్రాటెక్ సిమెంట్ లాభపడ్డాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. బిఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 2-3 శాతం మేరకు నష్టపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News