Sunday, December 22, 2024

మూడో రోజు నష్టాలు.. సెన్సెక్స్ 313 పాయింట్లు పతనం

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం కూడా నష్టాలను చవిచూశాయి. వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లో 313 పాయింట్లు నష్టపోయింది. అయితే బుధవారం మాదిరిగానే గురువారం ఉదయం మార్కెట్ 800 పాయింట్ల వరకు పడిపోయింది. కానీ ఆఖరి సమయంలో కోలుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 314 పాయింట్ల పతనంతో 71,187 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 110 పాయింట్ల నష్టంతో 21,462 పాయింట్ల వద్ద స్థిరపడింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్టాక్‌లో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా బ్యాంక్ నిఫ్టీలో వరుసగా రెండో రోజు భారీ పతనం కనిపించింది.

ట్రేడింగ్‌లో ఆటో, ఫార్మా, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రా హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎంసిజి, మెటల్స్, మీడియా, ఎనర్జీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు క్షీణతతో ముగిశాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 12 లాభాల్లో, 18 నష్టాలతో ముగిశాయి. దిగువ స్థాయిలలో కొనుగోళ్లు తిరిగి రావడంతో బిఎస్‌ఇ మార్కెట్ క్యాప్‌లో పెద్దగా క్షీణత లేదు. బిఎస్‌ఇలో లిస్టయిన స్టాక్‌ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.67,000 కోట్లు పడిపోయి రూ. 369.75 లక్షల కోట్ల వద్ద ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News