ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో రోజు పతనమయ్యాయి. వారాంతం శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 231 పాయింట్లు పతనమై 65,397 వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ కూడా 82 పాయింట్లు పతనమై 19,542 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 20 క్షీణించగా, 10 పెరిగాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజిఎల్) షేర్లు 11.94% పడిపోయాయి.
కంపెనీ షేర్లు 54.65 పాయింట్ల పతనంతో రూ.403 వద్ద ముగిశాయి. ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని తుది ఆమోదం కోసం ఎల్‌జికి పంపింది. పాలసీ ప్రకారం, ఢిల్లీ ప్రభుత్వం వచ్చే 6 నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల్లో 5 శాతం వృద్ధిని సాధించాలని యోచిస్తోంది. దీని కారణంగా బ్రోకరేజ్ హౌస్ జెఫరీస్ స్టాక్‌ను డౌన్‌గ్రేడ్ చేసింది. 202425 నుండి ఐజిఎల్ మొత్తం అమ్మకాలు 30 శాతం మేర ప్రభావితం కావచ్చని, ఆ తర్వాత స్టాక్ క్షీణించనున్నట్లు సంస్థ తెలిపింది. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఐఆర్‌ఎం ఎనర్జీ లిమిటెడ్ ఐపిఒ సబ్‌స్క్రిప్షన్‌కు శుక్రవారం ఆఖరి రోజు కాగా, ఈ ఐపిఒ ద్వారా రూ.545.40 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది.