- Advertisement -
581 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. గురువారం మార్కెట్ మళ్లీ భారీగా పతనమైంది. సెన్సెక్స్ 581 పాయింట్లు నష్టపోయి 57,276 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 167 పాయింట్లు (0.97 శాతం) పడిపోయి 17,110 వద్ద స్థిరపడింది. అన్ని ఐటీ కంపెనీల షేర్లు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 2.45 లక్షల కోట్లు తగ్గింది. మంగళవారం మార్కెట్ క్యాప్ రూ.262.77 లక్షల కోట్లు ఉండగా, నుంచి గురువారం రూ.260.32 లక్షల కోట్లుగా ఉంది. సెన్సెక్స్ 30 స్టాక్‌లలో, 9 లాభాల్లో ఉండగా, 21 నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్, మారుతీ, కోటక్ బ్యాంక్, సన్ ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ ప్రధానంగా లాభపడ్డాయి.
- Advertisement -