Monday, December 23, 2024

ప్రాఫిట్ బుకింగ్.. భారీ నష్టాల్లో మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

793 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను చవిచూసింది. ఈ వారం చివరి సెషన్‌లో ప్రాఫిట్ బుకింగ్, అలాగే బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసిజి, ఫార్మా షేర్లలో అమ్మకాల కారణంగా మార్కెట్ పతనమైంది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు కూడా నష్టపోయాయి. మార్కెట్ ముగిసే సమయానికి బిఎస్‌ఇ సెన్సెక్స్ 793 పాయింట్లు పతనమై 74,245 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 234 పాయింట్లు క్షీణించి 22,519 పాయింట్ల వద్ద స్థిరపడింది.

అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుదల, వస్తువుల ధరల పెరుగుదల కారణంగా మార్కెట్లో ఈ క్షీణత సంభవించింది. మధ్యాహ్నానికి స్టాక్ మార్కెట్ తీవ్ర పతనం నుంచి ఏ రంగం తప్పించుకోలేకపోయింది. బ్యాంకింగ్, ఆటో, ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్స్, రియల్ ఎస్టేట్, మీడియా, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, ఆయిల్ అండ్ గ్యాస్, కన్స్యూమర్ డ్యూరబుల్స్‌తో పాటు హెల్త్‌కేర్ రంగాల షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి. నేటి వ్యాపారంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో క్షీణత నెలకొంది. నేటి ట్రేడింగ్‌లో 3943 షేర్లు ట్రేడ్ అవగా, 1467 షేర్లు లాభాలతో ముగియగా, 2371 షేర్లు నష్టాలతో ముగిశాయి.

స్టాక్ మార్కెట్ క్షీణత కారణంగా, స్టాక్ మార్కెట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్షీణించింది. బిఎస్‌ఇ డేటా ప్రకారం, ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయిన షేర్ల మార్కెట్ క్యాప్ గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.402.16 లక్షల కోట్లు ఉండగా, శుక్రవారం ఇది రూ.399.76 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఒక్క రోజులో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.40 లక్షల కోట్లు తగ్గింది. ప్రధానంగా దివీస్ ల్యాబ్ 1.09 శాతం, బజాజ్ ఆటో 0.66 శాతం, టాటా మోటార్స్ 0.49 శాతం, టిసిఎస్ 0.42 శాతం, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్ 0.36 శాతం, నెస్లే 0.34 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 0.18 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు సన్ ఫార్మా 3.99 శాతం, మారుతీ సుజుకీ 3.28 శాతం, పవర్ గ్రిడ్ 2.58 శాతం, టైటాన్ 2.48 శాతం, ఒఎన్‌జిసి 2.32 శాతం నష్టాలతో ముగిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News