Sunday, December 22, 2024

రూ.5లక్షల కోట్లు హాంఫట్

- Advertisement -
- Advertisement -
  • మార్కెట్‌కు గ్లోబల్ టెన్షన్
  • కుప్పకూలిన స్టాక్ మార్కెట్
  • సెన్సెక్స్ భారీగా 885 పాయింట్లు పతనం

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల కారణంగా దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. అమెరికాలో నిరుద్యోగం పెరగడం, క్షీణించిన ఫ్యాక్టరీ డేటా వల్ల మందగమం ఆందోళనలు పెరిగాయి.

ఈ సంకేతాలు గ్లోబల్ మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి. ఈ టెన్షన్ వల్ల ఇప్పటికే ఆల్‌టైమ్ హైలో ఉన్న భారత్ మార్కెట్లలోనూ ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేపట్టారు. దీంతో మార్కెట్ల వరుస లాభాలకు బ్రేడ్ పడింది. నిఫ్టీ 25,000 మార్క్ దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ 885 పాయింట్లు పతనమై 80,982 పాయింట్ల వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు భారీగా నష్టపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News