Wednesday, January 22, 2025

ఎఫ్‌ఎంసిజి, ఎనర్జీ స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు

- Advertisement -
- Advertisement -

122 పాయింట్ల లాభపడిన సెన్సెక్స్

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. మంగళవారం ఒడిదుడుకుల తర్వాత మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఎఫ్‌ఎంసిజి, ఎనర్జీ స్టాక్స్‌లో కొనుగోళ్ల కారణంగా మార్కెట్ దిగువ స్థాయిల నుంచి మళ్లీ ఊపందుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 122 పాయింట్ల లాభంతో 71,437 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 35 పాయింట్ల జంప్‌తో 21,453 పాయింట్లు వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.45 వేల కోట్లు పెరిగింది. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.359.13 లక్షల కోట్లకు చేరగా, ఇది క్రితం సెషన్‌లో రూ.358.68 లక్షల కోట్లుగా ఉంది. ట్రేడింగ్‌లో ఎఫ్‌ఎంసిజి, ఫార్మా, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, కమోడిటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్ రంగాల షేర్లు లాభాలతో ముగిశాయి. కాగా ఆటో, ఐటి, మీడియా, మెటల్స్. రియల్ ఎస్టేట్ రంగ షేర్లు నష్టాలతో ముగిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News