Sunday, January 19, 2025

పుంజుకున్న మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

566 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై : ఇజ్రాయెల్ యుద్ధం భయాలతో సోమవారం నష్టపోయిన దేశీయ స్టాక్‌మార్కెట్లు మరుసటి రోజు పుంజుకున్నాయి. ఇటీవల చాలా నష్టాల తర్వాత ఫైనాన్షియల్స్, ఆటో, ఐటి షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తగా, మరోవైపు అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కనిపించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 566 పాయింట్లు పెరిగి 66,079 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 177 పాయింట్లు లాభపడి 19,689 పాయింట్ల వద్ద ముగిసింది. కోల్ ఇండియా, అదానీ పోర్ట్, భారతీ ఎయిర్‌టెల్‌లో కొనుగోళ్లతో మార్కెట్‌కు మద్దతు లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News