Wednesday, January 22, 2025

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల ఆల్ టైమ్ రికార్డ్!

- Advertisement -
- Advertisement -

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బీఎస్ఇ సెన్సెక్స్, ఎన్ఎస్ఇ నిఫ్టీ శుక్రవారం ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పాయి. ఈ రెండూ సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్ 847 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్లు చొప్పున లాభాలు చవిచూశాయి. శుక్రవారంనాడు మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు ఒకేరోజు 2.76 లక్షల కోట్లు లాభపడ్డారు.

ఉదయం 72,148.07 పాయింట్ల వద్ద సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమై, రోజంతా లాభాల్లోనే సాగింది. శుక్రవారం ఒక్క రోజే బీఎస్ఈ సెన్సెక్స్ మార్కెట్ కాపిటలైజేషన్ 2.76 లక్షల కోట్ల మేర వృద్ధి చెంది 373.24 లక్షల కోట్లకు చేరింది. దీనివల్ల ఇన్వెస్టర్లు భారీ లాభాలు గడించారు.  సెన్సెక్స్ లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్ సిఎల్ టెక్నాలజీ, విప్రో, టీసిఎస్ తదితర షేర్లు బాగా లాభపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 9 పైసలు బలపడి 82.92 వద్ద ముగిసింది.

బీఎస్ఇ 500 స్టాక్స్ లో అబాట్ ఇండియా, ఆంబెర్, అపోలో హాస్పిటల్స్, అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బిర్లాసాఫ్ట్, కోపోర్జ్, డిఎల్ఎఫ్ షేర్లు ఏడాది గరిష్ఠంలో ముగిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News