Friday, December 20, 2024

బడ్జెట్ మార్కెట్లు జై

- Advertisement -
- Advertisement -
Sensex gained 848 points
848 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

ముంబై : వృద్ధి అనుకూల బడ్జెట్‌కు దేశీయ స్టాక్‌మార్కెట్లు జైకొట్టాయి. బడ్జెట్ 2022ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన సమయంలో మార్కెట్లు దూకుడుగా కనిపించాయి. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అయినప్పటికీ మార్కెట్లు ఎలాంటి నష్టాలను చూడకుండా లాభాల్లోనే ఉన్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 848 పాయింట్లు పెరిగి 58,862 పాయింట్లకు చేరింది. ఇక నిఫ్టీ 237 పాయింట్లు లాభపడి 17,576 పాయింట్ల వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్ 1 శాతం, స్మాల్‌క్యాప్ 0.9 శాతం పెరిగాయి. టాటా స్టీల్, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, శ్రీ సిమెంట్, ఎల్ అండ్ టి, హిందాల్కో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. అదే సమయంలో బిపిసిఎల్, ఐఒసిఎల్, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఒఎన్‌జిసి, నష్టపోయాయి.

స్పందనలు

బడ్జెట్ వృద్ధి అనుకూలమైంది. ఉపాధిని సృష్టించేందుకు తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. భారతదేశం వేగంగా వృద్ధిని సాధించే దిశగా చర్యలు ఉన్నాయి.
ఎజిఐ గ్లాస్‌ప్యాక్ సిఇఒ రాజేశ్ ఖోస్లా

ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆచరణాత్మక, సానుకూలమైంది. స్టార్టప్ రంగానికి కట్టుబడి, ఊతమిచ్చేలా ఉంది. స్థిరమైన వృద్ధికి ఇది దోహదం చేస్తుంది.
టిహబ్ సిఇఒ ఎంఎస్‌ఆర్

కేంద్ర బడ్జెట్ డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లను ప్రొత్సహించేలా ఉంది. ఇది డిజిటల్ సేవలకు మరింత విస్తరింపజేస్తుంది.
అప్‌స్టాక్స్ కొఫౌండర్ కవితా సుబ్రమణ్యన్

ఆత్మనిర్భర్ భారత్‌కు నమ్మకమైన పాలనను నిర్మిస్తుంది. పన్ను చెల్లింపుదారులు, వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లు, సమస్యలను తీరుస్తుంది.
కోటక్ బ్యాంక్ ఎండి ఉదయ్ కోటక్

బడ్జెట్ 2022 ఆర్థిక వ్యవస్థను వేగంగా ముందు నడిపేందుకు దోహదం చేస్తుంది. వ్యాపారాలకు ప్రోత్సాహం అందిస్తోంది.
కోటక్ బ్యాంక్ కన్జూమర్ గ్రూప్ ప్రెసిడెంట్ శాంతి ఏకాంబరం

కొన్నిసార్లు బోరింగ్ మంచిదే, మార్కెట్ పరంగా ఇన్వెస్టర్, ట్రేడర్లకు ఎలాంటి కొత్తధనం లేదు. వర్చువల్ కరెన్సీ హేతుబద్దీకరణకు బడ్జెట్ చర్యలు చేపట్టింది.
ట్రూ బీకన్, జెరోధా కొఫౌండర్ నిఖిల్ కామత్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News