- Advertisement -
జీవితకాల గరిష్ఠానికి బిఎస్‌ఇ కంపెనీల మార్కెట్ విలువ
ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాలతో ముగిశాయి. అయితే బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీ మార్కెట్ విలువ (ఎంక్యాప్) రూ.280.52 లక్షల కోట్లతో జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. గురువారం మార్కెట్ తీవ్ర ఒడిదుకులను చూసింది. ఆఖరికి స్వల్ప లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 60300, నిఫ్టీ 18,000 దగ్గరకు చేరాయి. బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవలు, సిమెంట్ స్టాక్‌లు మంచి లాభాలను చూశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37.87 పాయింట్ల స్వల్ప లాభంతో 60,298 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50 12.25 పాయింట్ల లాభంతో 17,956 వద్ద స్థిరపడింది. అయితే బిఎస్‌ఇ కంపెనీల మొత్తం విలువ రూ.2,80,52,760.91 కోట్లకు చేరుకుంది.
- Advertisement -