Sunday, January 19, 2025

60వేల ఎగువన ముగిసిన సెన్సెక్స్

- Advertisement -
- Advertisement -

ముంబై: ముంబై స్టాక్‌మార్కెట్ సూచీ వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిసింది. రిస్క్ సెంటిమెంట్ పెరిగింది. మదుపరులు రూ. 2.12 కోట్ల మేరకు లాభపడ్డారు. నిఫ్టీ షూటింగ్ స్టార్ క్యాండిల్‌గా రూపుదాల్చింది. మార్చి 6న(సోమవారం) సెన్సెక్స్ 415.49 పాయింట్లు లేక 0.69 శాతం పెరిగి 60224.46 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 117.20 పాయింట్లు లేక 0.67 శాతం పెరిగి 17711.50 వద్ద ముగిసింది. హోలీ పండుగ సందర్భంగా స్టాక్ మార్కెట్ మార్చి 7న(మంగళవారం) మూసి ఉంటుంది. నేడు స్టాక్ మార్కెట్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా మోటార్స్, ఓఎన్‌జిసి, ఎన్టీపిసి ప్రధానంగా లాభపడగా, బ్రిటానియా, టాటాస్టీల్, జెఎస్‌డబ్లు స్టీల్, హిందాల్కో ప్రధానంగా నష్టపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ. 133.00(0.24 శాతం) పెరిగి రూ. 55854.00 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో రూపాయి విలువను పోల్చినప్పుడు 0.06 పైసలు తగ్గి రూ. 81.91 వద్ద స్థిరపడింది. యెస్ బ్యాంక్ మూడేళ్ల లాక్‌ఇన్ పీరియడ్ 2023 మార్చి 13న ముగియనుంది. ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం యెస్ బ్యాంక్ షేర్ల టార్గెట్ రూ. 19.30 ఉండనుంది. యెస్ బ్యాంక్ షేర్ ధర ఇటీవల రూ. 24.75 నుంచి రూ. 17.00కు పడిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News