Wednesday, January 22, 2025

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. దీంతో రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఉదయం ఫ్లాట్‌గా ఆరంభమైన మార్కెట్లు తర్వాత లాభాల్లోకి ఎగబాకాయి. ఇంట్రాడే గరిష్ఠాలను కూడా నమోదు చేశాయి. ఆసియా, పసిఫిక్, ఐరోపా మార్కెట్లు కూడా సానుకూలంగా కొనసాగాయి. నేడు ఐటీ స్టాకులు తప్పించి అన్ని రంగాల స్టాకుల్లో కొనుగోళ్లు కనిపించాయి. 30 షేర్లుండే సెన్సెక్స్ ప్యాక్ 468.38 పాయింట్లు లేక 0.76 శాతం పెరిగి 61806.19 వద్ద, నిఫ్టీ 151.45 పాయింట్లు లేక 0.83 శాతం పెరిగి 18420.45 వద్ద ముగిశాయి. నిఫ్టీ తిరిగా 18400 మార్కును చేరుకుంది. నిఫ్టీలో అదానీ పోర్ట్, ఐషెర్ మోటార్స్, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రధానంగా లాభపడగా, టిసిఎస్, ఓఎన్‌జిసి, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, టాటా మోటార్స్ నష్టపోయాయి. నిఫ్టీ ఆటో, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, మెటల్, ఎఫ్‌ఎంసిజి వంటి అన్ని రంగాలు లాభాల్లో కొనసాగగా ఒక్క ఐటి రంగమే 0.5 శాతం నష్టపోయింది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్‌క్యాప్ 0.3 శాతం పెరిగాయి. రాబోయే సెషన్లలో మార్కెట్ ఓలటైల్‌గా ఉండనున్నదనిపిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News