Saturday, December 21, 2024

జీవితకాల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీగా లాభపడ్డాయి. రోజంతా ఉత్సాహంగా సాగిన ట్రేడింగ్ చివరి అరగంటలో కొనుగోళ్ల ప్రవాహంతో లాభాల్ని నమోదు చేసింది. సెన్సెక్స్ అయితే జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. కాగా నిఫ్టీ 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచుతామన్న ఫెడ్ రిజర్వ్ ప్రకటన మార్కెట్‌లో జోష్‌ను నింపింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 762.10 పాయింట్లు లేక 1.24 శాతం పెరిగి 62272.68 వద్ద క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 216.85 పాయింట్లు లేక 1.19 శాతం పెరిగి 18484.10 వద్ద ముగిసింది. అపోలో హాస్పిటల్స్, హెచ్‌డిఎఫ్ సి లైఫ్, బిపిసిఎల్, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్ర టాప్ గెయినర్స్‌గా నిలువగా, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంక్, సిప్లా, కోల్ ఇండియా లి. , టాటా మోటార్స్ నష్టాల్లో ముగిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News