Thursday, December 19, 2024

ఆల్‌టైమ్ హై.. సరికొత్త శిఖరాలకు సెన్సెక్స్

- Advertisement -
- Advertisement -

సరికొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
బిఎస్‌ఇ మొత్తం కంపెనీల విలువ రూ.400 లక్షల కోట్లతో రికార్డు

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆల్‌టైమ్ హైకి చేరుకున్నాయి. సోమవారం కొనుగోళ్ల జోరుతో నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు సరికొత్త బిఎస్‌ఇ సూచీ సెన్సెక్స్ కీలక 74,800 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఇ సూచీ నిఫ్టీ 22,600 పాయింట్లను క్రాస్ చేశాయి. మరోవైపు బిఎస్‌ఇలో లిస్టయిన మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.400 లక్షల కోట్లు దాటగా, చరిత్రలో ఇదే తొలిసారి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, దేశీయంగా రె ర్యాలీని కొనసాగిస్తున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 74,869 పాయింట్లకు, నిఫ్టీ 22,697 వద్ద ఆల్ టైమ్ హైని నమోదు చేశాయి.

సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 21 షేర్లు లాభపడగా, 9 క్షీణించాయి. రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ ఆటో అత్యధికంగా 2.16 శాతం పెరిగింది. ఇంకా నిఫ్టీ రియల్టీ 1.33 శాతం, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 1.45 శాతం, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.83 శాతం పెరిగాయి. మరోవైపు నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్‌లో 0.89 శాతం, నిఫ్టీ మీడియాలో 0.77 శాతం, ఐటి రంగంలో 0.52 శాతం క్షీణత కనిపించింది. ఇక బంధన్ బ్యాంక్ షేర్లలో 6.21 శాతం క్షీణత కనిపించింది. బంధన్ బ్యాంక్ సిఇఒ చంద్ర శేఖర్ ఘోష్ రాజీనామాతో కంపెనీ షేర్లపై ఒత్తిడి నెలకొంది. అంతర్జాతీయంగా చూస్తే నాస్‌డాక్, ఎస్ అండ్ పి500 సూచీలు 1 శాతానికి పైగా పెరిగాయి. వారం చివరి ట్రేడింగ్ రోజు అంటే శుక్రవారం (ఏప్రిల్ 5) స్టాక్ మార్కెట్ లో స్వల్ప పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్ 20 పాయింట్ల లాభంతో 74,248 వద్ద ముగిసింది.

దలాల్ స్ట్రీట్ కొత్త రికార్డు
లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,00,88,716 కోట్లకు చేరుకుంది. భారతీయ స్టాక్ మార్కెట్ రూ.400 లక్షల కోట్లను దాటడం ఇదే తొలిసారి. డాలర్లలో చూస్తే, బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల ఎంక్యాప్ ఇప్పుడు 4.81 ట్రిలియన్ డాలర్లుగా మారింది. 2023 నవంబర్ చివరి నాటికి బిఎస్‌ఇ మార్కెట్ విలువ మొదటిసారిగా 4 ట్రిలియన్ డాలర్లను దాటింది. ఇప్పుడు ఈ సంఖ్య కేవలం 4 నెలల్లో 5 ట్రిలియన్ డాలర్లను దాటడానికి చాలా దగ్గరగా వచ్చింది. బిఎస్‌ఇ తర్వాత ఎన్‌ఎస్‌ఇ కూడా డిసెంబర్ 2023 ప్రారంభంలో 4 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News