Thursday, January 23, 2025

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు స్వస్తి పలికారు. విదేశీ మదుపర్లు పెట్టుబడులు పెట్టడం మార్కెట్లకు కలిసొచ్చింది.మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 248.84 పాయింట్లు లేక 0.40 శాతం పెరిగి 61872.99 వద్ద రికార్డు స్థాయిలో ముగిసింది. కాగా నిఫ్టీ 74.25 పాయింట్లు లేక 0.41 శాతం పెరిగి 18403.40 వద్ద ముగిసింది. ఓఎన్‌జిసి, పవర్ గ్రిడ్, ఐసిఐసిఐ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్ షేర్లు లాభపడగా, కోల్ ఇండియా లి., హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, సిప్లా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నష్టపోయాయి.అమెరికా డాలరుతో రూపాయి విలువ పోల్చినప్పుడు 0.17 పైసలు పడిపోయి 81.10 వద్ద ట్రేడయింది. ఇక బంగారం ధర 10 గ్రాములు రూ.152.00(0.29శాతం) పెరిగి 52865.00 వద్ద ట్రేడయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News