Wednesday, January 22, 2025

బ్లాక్ మండే

- Advertisement -
- Advertisement -

Sensex is down 1456 points

సెన్సెక్స్ 1,456 పాయింట్లు పతనం
 ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.6.32 లక్షల కోట్లు ఆవిరి
 అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఆందోళనలే కారణం
 ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలతో దేశీయంగా ప్రభావం

న్యూఢిల్లీ : స్టాక్ మార్కెట్‌కు ఇది మరో బ్లాక్ మండే, అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. ప్రపంచ వ్యాప్తంగా దేశాల్లో ద్రవ్యోల్బణం పెరగడం, అనేక స్థూల ఆర్థి క గణాంకాలు ఆందోళనకరంగా మారడంతో అంతర్జాతీయంగా మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ ప తనం చవిచూశాయి. గతవారం శుక్రవారం కూ డా సూచీలు భారీగా నష్టాలను చూశాయి. మా ర్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,457 పా యింట్లు (2.68 శాతం) పడిపోయి 52,847 పా యింట్లు నష్టపోయింది. నిఫ్టీ 427.40 పాయిం ట్లు లేదా 2.64 శాతం క్షీ ణించి 15,774.40 స్థాయి వద్ద ముగిసింది. మే 13 నుంచి ఇదే అ త్యంత కనిష్ట స్థాయి కావడం గమనార్హం.

రూపాయి క్రాష్..
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో రూ.78.26కి పడిపోయింది. దీంతో దిగుమతులు మరింత ఖరీదైనవిగా మారగా, కంపెనీల ఖర్చు పెరుగుతోంది. దీని కారణంగా ఈ కంపెనీలు ధరలను పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది దేశీయ డిమాండ్‌ను ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వ ఆర్థిక లోటు కూడా పెరగవచ్చు. జూన్‌లో విదేశీ ఇన్వెస్టర్లు తమ రూ.14,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

సెన్సెక్స్‌లోని 29 షేర్లు డౌన్
సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో అన్ని స్టాక్‌లు రెడ్‌మార్క్‌లో ముగిశాయి. ఇక ఒక నెస్లే ఇండియా షేరు మాత్రమే లాభపడింది. నెస్లే షేర్లు అర శాతం మాత్రమే పెరిగాయి. అన్నింటిలో భారీ పతనం వచ్చింది. బజాజ్ ఫిన్‌సర్వ్ 7 శాతంతో అతిపెద్ద క్షీణతను చవిచూసింది. అలాగే బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, టిసిఎస్, ఎన్‌టిపిసి, ఎస్‌బిఐ, ఇ న్ఫోసిస్, ఎల్ అండ్ టి, కోటక్ బ్యాంక్, విప్రో, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌సిఎల్ టెక్, టైటాన్, సన్ ఫార్మా, ఐటిసి, హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్ సహా స్టాక్స్ పతనమయ్యాయి. అన్ని రంగాలు భారీ నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎంసిజి, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, హెల్త్‌కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు కూడా నష్టపోయాయి.

మార్కెట్ పతనానికి కారణం
అమెరికాలో ద్రవ్యోల్బణం 40 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితిలో జూన్ 14 నుండి 15 వరకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం జరగనుండడం, ఈ భేటీలో ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారో? అనే ఆందోళనలు ఇన్వెస్టర్లలో ఉన్నాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చని భావిస్తున్నారు. ఈ కారణంగా స్టాక్‌మార్కెట్లో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. స్టాక్‌మార్కెట్ల నుండి అమ్మి సురక్షితమైన వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.

పెట్టుబడిదారులకు భారీగా నష్టాలు
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. భారత స్టాక్‌మార్కెట్ల భారీ పతనం కారణంగా మార్కెట్ ప్రా రంభమైన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఇన్వెస్టర్లు రూ.6.32 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయిం ది. బిఎస్‌ఇలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 251.84 లక్షల కోట్ల నుంచి రూ. 246.12 లక్షల కోట్లకు పడిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News