Monday, December 23, 2024

బుల్ జోరు

- Advertisement -
- Advertisement -
Sensex jumps 533 points
533 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

న్యూఢిల్లీ : ఈ వారంలో వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 533 పాయింట్ల లాభంతో 61,150 వద్ద ముగిసింది. నిఫ్టీ 156 పాయింట్లు పెరిగి 18,212 వద్ద స్థిరపడింది. పేటీఎం స్టాక్ 3.35 శాతం పతనమై రూ.1,082కి చేరుకుంది. మరోవైపు వొడాఫోన్ 9.39 శాతం లాభంతో రూ.12.80కు పెరిగింది. మంగళవారం దేశీయ కంపెనీల మార్కెట్ విలువ రూ.275.27 లక్షల కోట్లు ఉండగా, బుధవారం ఇది రూ.277.10 లక్షల కోట్లకు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3 శాతం ల్భాపడ్డాయి.

పేటీఎం షేర్ పతనంపై ఆ సంస్థకు చెందిన విజయ్ శేఖర్ శర్మ స్పందిస్తూ, కంపెనీ లిస్టింగ్ రాంగ్ టైమ్‌లో జరిగిందని అన్నారు. మూడు ఐటి దిగ్గజ సంస్థలు అయిన టిసిఎస్, విప్రో, ఇన్ఫోసిస్ తమ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. ఈ మూడింటిలో విప్రో నిరాశపర్చగా, మిగతా రెండు రాణించాయి. సెన్సెక్స్ 30 స్టాక్‌లలో 6 క్షీణించగా, 24 లాభాల్లో ఉన్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఎయిర్‌టెల్, ఎన్‌టిపిసి, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు టిసిఎస్, సిప్లా, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే, డాక్టర్ రెడ్డీ వంటి ప్రధాన స్టాక్‌లు పతనమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News