Saturday, December 21, 2024

రూ.1.92 లక్షల కోట్లు ఆవిరి

- Advertisement -
- Advertisement -

ముంబై : ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ బలహీన ఫలితాలు దేశీయ స్టాక్‌మార్కెట్లను నిరాశపర్చాయి. శుక్రవారం సెన్సెక్స్ 887 పాయింట్లు నష్టపోయి 66,684 వద్ద ముగిసింది. నిఫ్టీ 234 పాయింట్లు పతనమై 19,745 వద్ద స్థిరపడింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.92 లక్షల కోట్లు ఆవిరైంది. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.2.12 లక్షల కోట్లకు పడిపోయింది. గురువారం ఇది రూ.304.04 లక్షల కోట్లుగా ఉంది. ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్ అత్యధికంగా 8.81 శాతం నష్టపోయి రూ.1330 స్థాయికి పడిపోయింది.

నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అత్యధికంగా 4.09 శాతం నష్టపోయింది. ఇన్ఫోసిస్‌తో పాటు హెచ్‌సిఎల్, టిసిఎస్, విప్రో షేర్లు దాదాపు 3 శాతం నష్టపోయాయి. మరోవైపు ఎల్‌టి, ఎస్‌బిఐ, టాటా మోటార్స్ వంటి షేర్లు ఊపందుకున్నాయి. విభజన తర్వాత రిలయన్స్ షేరు కూడా 2.57 శాతం నష్టపోయి రూ.2526 వద్ద ముగిసింది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్ 60 శాతం పెరిగి రూ.40 వద్ద లిస్టయ్యింది. 92 శాతం పెరిగి రూ.48 వద్ద ముగిసింది. దీని ఇష్యూ ధర రూ.25గా ఉంది. ఐపిఒ ద్వారా కంపెనీ రూ.500 కోట్లు సమీకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News