Monday, December 23, 2024

వరుస లాభాలకు బ్రేక్

- Advertisement -
- Advertisement -

 168 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

ముంబై : స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు కు సోమవారం బ్రేక్ పడింది. మార్కెట్‌లో లాభాల స్వీకరణ ఎక్కువగా కనిపించింది. బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాల కారణంగా మార్కెట్లో క్షీణత సంభవించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 168 పాయింట్ల పతనంతో 71,315 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 38 పాయింట్ల పతనంతో 21,418 పాయింట్ల వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో ఆటో, ఫార్మా, మెటల్స్, మీడియా, ఇన్‌ఫ్రా కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు లాభాలతో ముగిశాయి.

బ్యాంకింగ్, ఐటి ఎనర్జీ, ఎఫ్‌ఎంసిజి రంగాల షేర్లు పతనమయ్యాయి. అయితే మిడ్ క్యాప్, స్మా ల్ క్యాప్ రంగాల సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 10 లాభపడగా, 20 నష్టాలతో ముగిశాయి. నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 19 లాభాలతో, 31 పతనంతో ముగిశాయి. అయితే పెట్టుబడిదారుల సంపదలో పెరుగుదల ఉంది. గత సెషన్‌లో రూ.357.84 లక్షల కోట్ల వద్ద ముగిసిన బిఎస్‌ఇ మార్కెట్ క్యాప్ చరిత్రాత్మక గరిష్ట స్థాయి రూ. 358.68 లక్షల కోట్లకు పెరిగింది. సోమవారం ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.84,000 కోట్లు పెరిగింది.

స్టాక్స్ విషయానికొస్తే ప్రధానంగా సన్ ఫార్మా 1.25 శాతం, రిలయన్స్ 0.99 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.92 శాతం, హెచ్‌సిఎల్ టెక్ 0.74 శాతం, ఏసియన్ పెయింట్స్ 0.60 శాతం, హెచ్‌యుఎల్ 0.49 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు పవర్ గ్రిడ్ 2.34 శాతం, జెఎస్‌డబ్ల్యూ స్టీల్ 1.46 శాతం, ఐటిసి 1.45 శాతం, ఐసిఐసిఐ బ్యాంక్ 1.25 శాతం, టెక్ మహీంద్రా 0.99 శాతం, ఇన్ఫోసిస్ 0.98 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.77 శాతం పతనంతో ముగిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News