- Advertisement -
ముంబై : ఈ వారంలో రెండో రోజు మంగళవారం స్టాక్‌మార్కెట్ భారీగా పతనమైంది. సెన్సెక్స్ 383 పాయింట్ల నష్టంతో 57,300 వద్ద, నిఫ్టీ 114 పాయింట్లు పతనమై 17,092 వద్ద ముగిశాయి. టాటా స్టీల్ షేర్లు 4 శాతం, టిసిఎస్ 3.45 శాతం మేర పడిపోయాయి. రష్యాఉక్రెయిన్ మధ్య యుద్ధం పరిస్థితులతో ఇన్వెస్టర్లు ఆందోళలో ఉన్నారు. దీంతో సేల్స్ పెరిగాయి. ఒక్క రోజే రూ.2.50 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్లకు నష్టం వాటిల్లింది. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ సోమవారం రూ.254.76 లక్షల కోట్ల నుంచి రూ.252.27 లక్షల కోట్లకు పడిపోయింది.
వచ్చే ఏడాదిలో స్విగ్గీ ఐపిఒ
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తర్వాత ఇప్పుడు స్విగ్గీ కూడా ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. నిక్కీ ఆసియా నివేదిక ప్రకారం, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ వచ్చే ఏడాది ప్రారంభంలో 800 మిలియన్ డాలర్ల ఐపిఒని తీసుకురావచ్చు.
- Advertisement -