Friday, December 27, 2024

రికవరీకి షాక్

- Advertisement -
- Advertisement -

Sensex lost 715 points

సెన్సెక్స్ 715 పాయింట్ల నష్టం

ముంబై : రెండు రోజుల ర్యాలీ తర్వాత వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం మార్కెట్లు పతనమయ్యాయి. రికవరీ అవుతోందనుకుంటున్న దశలో మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను వచ్చే నెలలో పెంచనుందనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు అమ్మకాలు పెంచారు. దీంతో సెన్సెక్స్ 714.53 పాయింట్లు (1.23 శాతం) నష్టపోయి 57,197.15 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 220.65 (1.27 శాతం) పాయింట్లు పడిపోయి 17,171.95 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో హెచ్‌సిఎల్ టెక్, మహీంద్రా, మారుతీ, భారతీ ఎయిర్‌టెల్, ఐటిసి లాభపడ్డాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 25 క్షీణించగా, 5 లాభపడ్డాయి. బిఎస్‌ఇలో మిడ్, స్మాల్ క్యాప్స్ 100 పాయింట్లకు పైగా నష్టపోయాయి. మిడ్‌క్యాప్‌లో క్రిసిల్, అదానీ పవర్, ఆస్టెరల్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. బాలకృష్ణ ఇండస్ట్రీస్, 3ఎం ఇండియా, ఎయు బ్యాంక్, గ్లెన్ మార్క్, టాటా కమ్యూనికేషన్స్ నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే ఆటో, బ్యాంక్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్, పిఎస్‌యు బ్యాంక్ 1 శాతం కంటే ఎక్కువ పతనమయ్యాయి. ఐటి, ఎఫ్‌ఎంసిజి, మెటల్, రియాల్టీల్లో స్వల్ప క్షీణత నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News