Sunday, January 19, 2025

స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్

- Advertisement -
- Advertisement -

ముంబై: భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఒడిదుడుకుల మధ్య చివరికి నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 87.12 పాయింట్లు లేక 0.14 శాతం పడిపోయి 61663.48 వద్ద ముగిసింది. నిఫ్టీ 36.20 పాయింట్లు లేక 0.20 శాతం పడిపోయి 18303.70 వద్ద ముగిసింది. దాదాపు 1424 షేర్లు లాభపడగా, 1966 షేర్లు నష్టాలను చవిచూశాయి. 119 షేర్లు మార్పులేకుండా యథాతథ స్థితిలో ముగిశాయి. నిఫ్టీలో టాప్ గెయినర్స్‌గా హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, ఎస్‌బిఐ, కొటక్ మహీంద్రా నిలువగా, ఎం అండ్ ఎం, బజాజ్ ఆటో, సిప్లా, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకీ నష్టపోయాయి. రియాల్టీ, పిఎస్‌యూ బ్యాంక్ రంగాలు తప్ప అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. బిఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.4 శాతం మేరకు పడిపోయాయి. ఇక డాలరుతో రూపాయి పోల్చినప్పుడు రూ. 81.68 వద్ద ముగిసింది. ఇది మునుపటి రూ. 81.64 కన్నా కాస్త క్షీణించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News