Monday, January 20, 2025

వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు సెషన్‌లో నష్టాలు మూటగట్టుకున్నాయి. చైనాలో కరోనా కేసులు నమోదు కావడం, ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నష్టాల్లో ముగియడం, ఐరోపా సూచీలు ప్రతికూలంగా మొదలవ్వడంతో సెంటిమెంటు దెబ్బతింది. చివరకు సెన్సెక్స్ 518.64 పాయింట్లు లేక 0.84 శాతం పడిపోయి 61144.84 వద్ద ముగిసింది. నిఫ్టీ 147.70 పాయింట్లు లేక 0.81 శాతం నష్టపోయి 18159.95 వద్ద ముగిసింది. టాప్ గెయినర్లలో బిపిసిఎల్, భారతి ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ నిలువగా, టాప్ లూజర్స్‌లో ఓఎన్‌జిసి, అదానీ పోర్ట్ సెజ్, హిందాల్కో, హెచ్‌డిఎఫ్‌సి నిలిచాయి. అమెరికా డాలరుతో రూపాయి విలువ 0.14 పైసలు(0.17 శాతం) పెరిగి 81.84 వద్ద ట్రేడయింది. బంగారం ధర 252.00 రూపాయలు లేక 0.48 శాతం పతనమై రూ. 52335.00 వద్ద ట్రేడవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News