ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ మళ్లీ రికార్డు బ్రేక్ చేశాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో(పాజిటివ్ గ్లోబల్ క్యూస్) దేశీ మార్కెట్ సూచీలు దూసుకెళ్లాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్‌బ్యాంక్ వడ్డీరేట్లు, జాబ్‌మార్కెట్‌పై చేసిన ప్రకటన , చైనా స్థిరాస్తి దిగ్గజం-ఎవర్‌గ్రాండే గ్రూప్ తన దేశీయ మార్కెట్‌కు కొన్ని సౌలభ్యాలు కల్పించడం, రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రాధాన్యతనిస్తాననడం వంటివి దేశీయ మార్కెట్ల ర్యాలీకి ఊతమిచ్చాయి.
సెన్సెక్స్ 958 పాయింట్లు లేక 1.63 శాతం పెరిగి కొత్త రికార్డు 59,885ను తాకింది. ఇక నిఫ్టీ 276 పాయింట్లు లేక 1.57 శాతం పెరిగి అత్యధికస్థాయి 17823లో ముగిసింది. బాగా లాభపడిన షేర్లలో బజాజ్ ఫైనాన్స్, ఎల్‌అండ్‌టి, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బిఐ, రిలయన్స్ ఉన్నాయి. కాగా డాక్టర్ రెడ్డీస్, ఐటిసి, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఇలో నిఫ్టీ రియాల్టీ, బ్యాంక్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసుల సెక్టార్ 8.66శాతం మేరకు లాభపడింది.