Wednesday, November 20, 2024

బేర్స్ గుప్పిట్లోకి జారుకుంటున్న మార్కెట్లు

- Advertisement -
- Advertisement -
sensex plunges
1158 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌లో బేర్‌లు పట్టు బిగించారు.అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్లు గణనీయంగా పతనమయ్యాయి. బ్యాంకింగ్, మెటల్, రియాల్టీ స్టాకులను మదుపర్లు పెద్ద ఎత్తున అమ్మేయడంతో మారెట్లు గణనీయంగా పతనమాయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు చెందిన సెన్సెక్స్ 1158.63 పాయింట్లు లేక 1.89 శాతం పడిపోయి 59984.70 వద్ద ముగిసింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు చెందిన నిఫ్టీ 353.70 పాయింట్లు లేక 1.94 శాతం పడిపోయి 17857.30 వద్ద ముగిసింది. దాదాపు 887 షేర్లు లాభపడగా, 2313 షేర్లు నష్టపోయాయి. 116 షేర్లు మార్పు లేకుండా ఉండిపోయాయి. నిఫ్టీ షేర్లలో అదానీ పోర్ట్, ఐటిసి, ఓఎన్‌జిసి, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్ షేర్లు నష్టపోగా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టి, అల్ట్రాటెక్ సిమెంట్, ఏసియన్ పెయింట్స్, శ్రీసిమెంట్స్ లాభపడ్డాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఫార్మా రంగానికి చెందిన సూచీలు 2 నుంచి 5 శాతం మేరకు రెడ్‌లోనే ముగిసాయి. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో మిడ్‌క్యాప్ సూచీలు, స్మాల్‌క్యాప్ సూచీలు 1శాతం చొప్పున నష్టపోయాయి.

ఇదిలా ఉండగా మోర్గాన్ స్టాన్లీ గురువారం భారతీయ ఈక్విటీలను ఓవర్‌వెయిట్ నుంచి ఈక్వల్ వెయిట్‌కు తగ్గించింది. షార్ట్ టర్మ్‌లో మరింత కన్సాలిడేషన్ ఉండగలదని కూడా పేర్కొంది. యూరొపియన్ సెంట్రల్ బ్యాంక్ పాలసీ అప్‌డేట్ ఉన్నందున ఆసియా, యూరొప్ మార్కెట్‌ల బలహీన సంకేతాల ఆధారంగా బేర్స్ మారెట్లలో పట్టు బిగించారు. ప్రపంచవ్యాప్తంగా మదుపరులు అమెరికా జిడిపి విడుదల కోసం కూడా ఎదురుచూస్తున్నారు. నేటి మార్కెట్ పతనానికి మదుపరులు పెద్దగా నిస్తేజులు ఏమి కాలేదు. నేటి మార్కెట్ కనిష్టం గణనీయమైనదే. ఒకవేళ బేరిష్ సెంటిమెంట్ కొనసాగితే నిఫ్టీ 17500 వరుకు జారుకోగలదు. నిఫ్టీ తదుపరి సపోర్ట్ జోన్ 17550-17650 మధ్య ఉంది. కాగా డెయిలీ చార్ట్‌లో నిఫ్టీ బేరిష్ మారబోజు క్యాండిల్‌ను రూపొందించింది. అంటే సెలర్స్ బాగా క్రియాశీలకంగా ఉన్నారని అర్థం. అంతేకాక ప్రైస్ 21 రోజుల సింపుల్ మూవింగ్ యావరేంజ్ కంటే కింద కదలాడుతోంది. తదుపరి ట్రేడింగ్ సెషన్‌లో కూడా లోయర్ ట్రెండ్ ఉండగలదనిపిస్తోంది. ప్రస్తుతానికి నిఫ్టీ సపోర్ట్ 17690 వద్ద, రెసిస్టెన్స్ 18180 వద్ద ఉంది అని చాయిస్ బ్రోకింగ్‌లో రీసెర్చ్ అసోసియేట్‌గా పనిచేస్తున్న పలక్ కొఠారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News