Monday, January 20, 2025

ముంచిన యుద్ధం

- Advertisement -
- Advertisement -

‘బేర్’మన్న ప్రపంచ మార్కెట్లు
గతవారం సెన్సెక్స్ 1600 పాయింట్లు నష్టం
(మార్కెట్ సమీక్ష)

Sensex ends 1545 pts lower, nifty near 17150

ముంబై : గత వారం దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. కరోనా మహమ్మారి ముగిసిందనుకుంటే, ఇప్పుడు ఉక్రెయిన్ష్య్రా యుద్ధం మొదలైంది. ఈ దేశాల మధ్య వివాదం ప్రపంచ మార్కెట్లను కుదిపేశాయి. మళ్లీ కరోనా మహమ్మారి ప్రారంభమైన 2020 సంవత్సరం నాటికి పరిస్థితులను గుర్తుచేశాయి. అప్పుడు 3 వేల వరకు సెన్సెక్స్ పతనం కాగా, ఇప్పుడు కూడా ఉక్రెయిన్ష్య్రా యుద్ధం ప్రారంభించిన రోజు అంటే గురువారం నాడు భారీ స్థాయిలో మార్కెట్లు కుప్పకూలాయి. కానీ మరుసటి రోజు అంటే శుక్రవారం సగం మేరకు మార్కెట్లు కోలుకున్నాయి. సెన్సెక్స్ 1,328 పాయింట్లు పెరిగి 55,858 పాయింట్లు పెరిగింది. ఇక నిఫ్టీ 410 పాయింట్లు లాభపడి 16,658 పాయింట్లు లాభపడింది. అయితే బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,72,873 కోట్లు పెరిగి రూ.2,49,97,053 కోట్లకు చేరింది. 19 రంగాల సూచీలు పెరిగాయి. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ సూచీలు కూడా 4.17 శాతం పెరిగాయి.
సోమవారం :
రష్యా, ఉక్రెయిన్ మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. దీంతో మార్కెట్లో అమ్మకాలు పెరిగాయి. వరుసగా మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 149 పాయింట్లు నష్టపోయి 57,683 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 70 పాయింట్లు పడిపోయి 17,206 పాయింట్ల వద్ద స్థిరపడింది. మిడ్, స్మాల్‌క్యాప్ షేర్లు భారీగా 2 శాతం వరకు పతనమయ్యాయి.
మంగళవారం :
ఈ వారంలో రెండో రోజు మంగళవారం స్టాక్‌మార్కెట్ పతనమైంది. సెన్సెక్స్ 383 పాయింట్ల నష్టంతో 57,300 వద్ద, నిఫ్టీ 114 పాయింట్లు పతనమై 17,092 వద్ద ముగిశాయి. టాటా స్టీల్ షేర్లు 4 శాతం, టిసిఎస్ 3.45 శాతం మేర పడిపోయాయి. రష్యాఉక్రెయిన్ మధ్య యుద్ధం పరిస్థితులతో ఇన్వెస్టర్లు ఆందోళలో ఉన్నారు. దీంతో సేల్స్ పెరిగాయి. ఒక్క రోజే రూ.2.50 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్లకు నష్టం వాటిల్లింది. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ సోమవారం రూ.254.76 లక్షల కోట్ల నుంచి రూ.252.27 లక్షల కోట్లకు పడిపోయింది.

Sensex slips 656 points to settle at over 60000
బుధవారం:
వరుసగా ఆరో రోజు బుధవారం దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టపోయాయి. ఫైనాన్షియల్, ఆటోమొబైల్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో రెండు సూచీలు పతనమయ్యాయి. అయితే అధిక స్థాయిలో ప్రారంభమైనప్పటికీ, ఆఖరి గంటలో నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 69 పాయింట్లు కోల్పోయి 57,232 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 29 పాయింట్లు నష్టపోయి 17,063 పాయింట్ల వద్ద స్థిరపడింది. అయితే మిడ్, స్మాల్ క్యాప్ షేరు సానుకూలంగా ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.64 శాతం, స్మాల్ క్యాప్ 1.16 శాతం పెరిగాయి. స్టాక్స్ విషయానికొస్తే, ఒఎన్‌జిసి టాప్ లూజర్‌గా నిలిచింది. ఆ తర్వాత హీరో మోటోకార్ప్, ఎన్‌టిపిసి, ఎల్ అండ్ టి, జెఎస్‌డబ్లు స్టీల్ కూడా పతనమయ్యాయి. మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్, మారుతీ సుజుకీ మంచి లాభాలను నమోదు చేశాయి. బిఎస్‌ఇ మొత్తం లిస్టెడ్ కంపెనీల్లో 2,194 షేర్లు లాభపడగా, 1,0172 షేర్లు పతనమయ్యాయి.
గురువారం :
రష్యా దళాలు ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రారంభించాయనే వార్తలతో ప్రపంచ దేశాలతో పాటు భారత్ మార్కెట్లు కూడా కుప్పకూలాయి. బిఎస్‌ఇ సూచీ సెన్సెక్స్ ఏకంగా 2,702 పాయింట్లు పతనమైంది. ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.13 లక్షల కోట్లు ఆవిరైంది. సెన్సెక్స్ అత్యధికంగా 2,702 పాయింట్లు (4.72 శాతం) పడిపోయి 54,530 పాయింట్ల వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ 815 పాయింట్లు నష్టపోయి 16,248 పాయింట్ల వద్ద స్థిరపడింది. గురువారం నాటి ట్రేడింగ్‌లో బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.242.31 లక్షల కోట్లకు పడిపోయింది. అంతకుముందు బుధవారం ఈ మొత్తం రూ.255.68 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లు రూ.13.37 లక్షల కోట్లు నష్టపోయారు. ఫిబ్రవరి నెలలో ఇన్వెస్టర్లు రూ.28 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. ఫిబ్రవరి 2 నాటికి బిఎస్‌ఇ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 270.64 లక్షల కోట్లుగా ఉండగా, ఇది ఇప్పుడు రూ.242.31 కోట్లకు తగ్గింది. అంటే రూ.28.33 లక్షల కోట్లు పడిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News