- Advertisement -
ముంబై : వరుసగా నాలుగు రోజులుగా నష్టాలను చూస్తున్న మార్కెట్లు ఎట్టకేలకు మంగళవారం లాభాలను చవిచూశాయి. ఐటి, ఫార్మా స్టాక్స్‌లో కొనుగోళ్ల దన్నుతో మార్కెట్లు కొంత పెరిగాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 581 పాయింట్లు పెరిగి 53,424 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 16,013 పాయింట్ల వద్ద స్థిరపడింది. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు లాభపడ్డాయి. 15 సెక్టార్లలో 13 రంగాలు లాభాలను చూశాయి. నిఫ్టీ ఐటి, నిఫ్టీ ఫార్మా అత్యంతగా లాభపడ్డాయి.
- Advertisement -