Monday, December 23, 2024

నేడు లాభాల్లో ముగిసిన సెన్సెక్స్

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. అమెరిక ఫెడరల్ రిజర్వ్ సూచించినట్లుగా వారు త్వరలో రేట్ల పెంపు చక్రాన్ని ఆపవచ్చు. ఇది మే 4న దలాల్ స్ట్రీట్‌లోని మార్కెట్ భాగస్వాముల మూడ్‌ని పెంచేసింది. బ్యాంకులు, ఆర్థిక సేవల స్టాక్‌లు వెలుగులోకి వచ్చాయి, అయితే ఎఫ్‌ఎంసిజి షేర్లు కొంత అమ్మకాల ఒత్తిడిని చూశాయి.

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 నేడు 165.95 పాయింట్లు లేక 0.92 శాతం పెరిగి 18255.80 వద్ద ముగిసింది. ఇక బిఎస్‌ఈ సెన్సెక్స్ 555.95 పాయింట్లు లేక 0.91 శాతం పెరిగి 61749.25 వద్ద ముగిసింది. నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బిఐ లైఫ్, హెచ్‌డిఎఫ్‌సి షేర్లు లాభపడగా, యూపిఎల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, టాటా కన్జూమర్ షేర్లు నష్టపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News