Sunday, November 17, 2024

కొనసాగుతున్న బుల్ ర్యాలీ

- Advertisement -
- Advertisement -
Sensex rises 157 points
157 పాయింట్లు పెరిగి

ముంబై : వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. అయితే గురువారం ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ మార్కెట్లు ముందుకు సాగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మాస్యూటికల్స్ షేర్లు లాభపడగా, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో నష్టాలు వచ్చాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 157 పాయింట్లు పెరిగి 58,807 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 17,516 పాయింట్ల వద్ద స్థిరపడింది. మొత్తం స్టాక్స్‌లో 2,046 లాభపడగా, 1,153 షేర్లు నష్టపోయాయి. ఇక 115 షేర్లలో ఎలాంటి మార్పులేదు. సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో ఐటిసి భారీగా లాభపడింది. ఈ స్టాక్ 5 శాతం పెరిగి రూ.236కు చేరింది. ఎల్ అండ్ టి 3 శాతం పెరిగింది. ఇక ఏసియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ మంచి లాభాలను నమోదు చేశాయి. మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1.7 శాతం పడిపోయింది. అలాగే టైటాన్, నెస్లె ఇండియా, ఎన్‌టిపిసి కూడా నష్టాలను చవిచూశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News