Thursday, January 23, 2025

ఐటి స్టాక్స్ దన్నుతో మార్కెట్‌కు జోష్

- Advertisement -
- Advertisement -

66 వేల పాయింట్లకు చేరువలో సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలను జోరును కొనసాగిస్తున్నాయి. గురువారం ఐటి స్టాక్స్ దన్నుతో సెన్సెక్స్ మరో 306 పాయింట్లు పెరిగింది. ఆఖరికి 65,982 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 89 పాయింట్లు పెరిగి 19,765 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 22 షేర్లు లాభపడగా, 8 షేర్లు క్షీణించాయి. ఐటి ఇండెక్స్ దాదాపు 3 శాతం లాభంతో ముగిసింది. రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో సూచీలు 1 శాతం పెరిగాయి. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు బలహీనపడి రూ.83.23 వద్ద ముగిసింది.

టాటా ఐపిఒ ధర రూ.475 -500
నవంబర్ 22న ప్రారంభమయ్యే టాటా టెక్నాలజీస్ ఐపిఒ ధర శ్రేణి ఒక్కో షేరుకు రూ.475 -500గా నిర్ణయించారు. ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) ద్వారా మొత్తం 6.08 కోట్ల షేర్లు అమ్మకానికి ఉంటాయి. ఇది మొత్తం ఈక్విటీ క్యాపిటల్‌లో 15 శాతం ఉంటుంది. ఈ ఐపిఒ ఈ నెల 24న ఆఫర్ ముగుస్తుంది. ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అనుబంధ సంస్థనే ఈ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్, అయితే దాదాపు 19 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ ఐపిఒతో వస్తోంది.

2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఐపిఒ వచ్చింది. ఆ తర్వాత ఈ గ్రూప్ నుంచి ఐపిఒ రావడం ఇదే. నాలుగు నెలల క్రితం ఐపిఒ ద్వారా నిధులను సేకరించేందుకు కంపెనీకి మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ (సెబీ) ఆమోదం తెలిపింది. ఈ కొత్త కంపెనీ షేర్లు డిసెంబర్ 5న బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలలో లిస్ట్ కానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News