Friday, December 20, 2024

మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలత కారణంగా మన మార్కెట్లూ రాణించాయి. సెన్సెక్స్ 89.83 పాయింట్లు లేక 0.12 శాతం పెరిగి 73738.45 వద్ద ముగియగా, నిఫ్టీ 31.60 పాయింట్లు లేక 0.14 శాతం పెరిగి 22368.00 వద్ద ముగిసింది. నిఫ్టీ 50లో ప్రధానంగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్ టెల్, నెస్లే ఇండియా, మారుతి సుజుకీ లాభపడగా , సన్ ఫార్మ, బిపిసిఎల్, ఆర్ఐఎల్, మహీంద్రా అండ్ మహీంద్ర లాభపడ్డాయి. కాగా టాటా కన్జూమర్ బోర్డ్ ఒక్కో షేరుకు రూ. 7.75 డివిడెండ్ పేమెంట్ ను సిఫార్సు చేసింది. ఇక డాలరు మారకంతో పోల్చినప్పుడు రూపాయి విలువ ఫ్లాట్ గానే ముగిసింది. అమెరికా డాలరుకు భారత కరెన్సీ రూ. 88.34 వద్ద ముగిసింది. గత రేటు 83.36తో పోల్చినప్పుడు పెద్దగా మారలేదనే చెప్పాలి.

వోలాటిలిటీ గేజ్ అయిన విక్స్(VIX) అనూహ్యంగా 19 శాతం పడిపోయి 10.26 వద్ద ముగిసింది. దాదాపు 12 నెలల కనిష్ఠానికి చేరుకుంటోంది. మరికొన్ని ట్రేడింగ్ సెషన్స్ లో కరెక్షన్ జరగొచ్చిన ట్రేడర్లు భావిస్తున్నారు. విక్స్ ను ఫియర్ ఇండెక్స్ అని కూడా భావిస్తుంటారు. సాధారణంగా ఇది రాబోయే 30 రోజుల్లో ఆప్షన్ మార్కెట్ ఎలా ఉండనున్నదో, ఎంత శాతం నిఫ్టీ సూచీ మారనున్నదో సూచిస్తుంది. ‘‘విక్స్ ప్రస్తుతం మీడియం టర్మ్ సపోర్ట్ లెవెల్స్ చేరుకుంటోంది. అక్కడి నుంచి అది యూ టర్న్ తీసుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికల మధ్య దశలో ఇలా జరిగే అవకాశం ఉంది’ అని మంత్రి ఫిన్మార్ట్ వ్యవస్థాపకుడు అరుణ్ కుమార్ మంత్రి తెలిపారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News