Monday, December 23, 2024

ఆల్‌టైమ్ హైకి మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

72,281 పాయింట్లకు చేరిన సెన్సెక్స్

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు కీలక మార్క్‌ను చేరుకుని రికార్డు సృష్టించాయి. నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎఫ్‌ఎంసిజి, కన్స్యూమర్ డ్యూరబుల్స్ స్టాక్స్‌లో కొనుగోళ్ల కారణంగా మార్కెట్‌లో పెరుగుదల నమోదైంది. మార్కెట్ ముగిసే సమయానికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 22,122 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే ఇంట్రాడేలో నిఫ్టీ 22,186 పాయింట్ల స్థాయికి చేరుకుంది. ఇక సెన్సెక్స్ 281 పాయింట్ల లాభంతో 72,281 పాయింట్ల వద్ద స్థిరపడింది.

తొలిసారిగా రూ.392 లక్షల కోట్లు
స్టాక్ మార్కెట్‌లో అద్భుతమైన పెరుగుదల కారణంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ రికార్డు స్థాయికి చేరుకుంది. బిఎస్‌ఇలో లిస్టయిన స్టాక్‌ల మార్కెట్ క్యాప్ తొలిసారిగా రూ.392 లక్షల కోట్లను దాటింది. గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.389.41 లక్షల కోట్ల వద్ద ముగిసిన బిఎస్‌ఇ మార్కెట్ క్యాప్, సోమవారం రూ.391.74 లక్షల కోట్ల వద్ద ముగిసింది. అంటే ఒక్క రోజులో మార్కెట్ విలువ రూ.2.33 లక్షల కోట్లు పెరిగింది.

ట్రేడింగ్ ముఖ్యంగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసిజి, బ్యాంకింగ్, ఆటో, ఫార్మా, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు భారీ లాభాలతో ముగిశాయి. ప్రభుత్వ కంపెనీలు, స్థిరాస్తి, ప్రభుత్వ బ్యాంకుల సూచీ, ఐటి షేర్ల సూచీలు నష్టాలతో ముగిశాయి. మిడ్‌క్యాప్, స్మాల్ స్టాక్స్‌లో కొనుగోళ్ల కారణంగా రెండు సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 17 స్టాక్స్ లాభాలతో ముగియగా, 13 నష్టాలతో ముగిశాయి. స్టాక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్ 2.29 శాతం, ఐసిఐసిఐ బ్యాంక్ 2.04 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.77 శాతం, ఐటిసి 1.58 శాతం, లార్సెన్ 1.11 శాతం, టిసిఎస్ 0.70 శాతం లాభపడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News