Monday, December 23, 2024

ముందుకు కదలని మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

గతవారం 587 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు గత వారం హెచ్చుతగ్గుల మధ్య కొంతమేరకు లాభాలను చూశాయి. అంతర్జాతీయ అంశాలు, దేశీయ పరిణామాలు వెరసి సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు వరుసగా 61,002 పాయింట్లు, 17,944 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే వరుస లాభాల తర్వాత వారాంతంలో మార్కెట్ దూకుడుకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ చివరి రోజు 316 పాయింట్లు కోల్పోయింది. అయితే వారం మొత్తంగా చూస్తే సెన్సెక్స్ 587 పాయింట్లు పెరిగింది. శుక్రవారం 13 రంగాలకు గాను 12 సెక్టార్లు క్షీణించాయి. ఫైనాన్షియల్స్, ఐటి సెక్టార్ల నష్టాలు వరుసగా 0.83 శాతం, 1.21 శాతం నమోదవగా, ఈ కారణంగా మార్కెట్లు పతనమయ్యాయి.

ఇక అంతకుముందు గురువారం నాడు మార్కెట్లు స్వల్ప లాభాలను చూశాయి. సెన్సెక్స్ గరిష్ట స్థాయి నుంచి 360 పాయింట్లు కిందకు పడిపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 44 పాయింట్ల స్వల్ప లాభంతో 61,319 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 18,035 వద్ద స్థిరపడింది. ఇక బుధవారం నాడు చూస్తే, సెన్సెక్స్ 242 పాయింట్ల లాభంతో 61,275 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 86 పాయింట్లు లాభపడి 18,015 వద్ద స్థిరపడింది. వరుసగా రెండో రోజు మార్కెట్ లాభపడింది. దేశీయ కంపెనీల ఫలితాలు మెరుగ్గానే కనిపిస్తున్నప్పటి సూచీలు ముందుకు కదలడం లేదు.

ద్రవ్యోల్బణం తీరు ఇలా..
రిటైల్ ద్రవోల్బణం పెరగ్గా, టోకు ద్రవ్యోల్బణం తగ్గింది. జనవరిలో దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం 6.52 శాతానికి పెరిగింది. ఆహార వస్తువుల ధరలు పెరగడంతో మూడు నెలల గరిష్ఠానికి చేరుకుంది. 2021 జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.01 శాతంతో పోలిస్తే 0.50 శాతం పెరుగుదల కనిపిస్తోంది. అయితే 2022 డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 5.72 శాతంతో దిగువన ఉంది. వినిమయ ధరల సూచీ(సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణాన్ని రిటైల్ ద్రవ్యోల్బణంగా పిలుస్తారు. గృహ నిత్యావసరాల కోసం వినియోగించే వస్తు, సేవల రిటైల్ ధరల్లో మార్పులను ఇది సూచిస్తుంది.

దేశీయ గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 6.85 శాతం నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 6 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం గతేడాదిలో 5.43 శాతం నుంచి 5.94 శాతానికి పెరిగింది. ఇది 2022 డిసెంబర్‌లో 4.19 శాతంతో పోలిస్తే అత్యధికంగా ఉంటుంది. ఇటీవల ఎంపిసి సమీక్ష వివరాలను ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించగా, ఈ ఆర్థిక సంవత్సరానికి(202223) రిటైల్ ద్రవ్యోల్బణం 6.5 శాతం ఉంటుందని అంచనా వేశారు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో(202324) శాతంగా ఉంటుందని అంచనా వేశారు. అయితే జనవరిలో టోకు ద్రవ్యోల్బణం (డబ్లుపిఐ) తగ్గింది. టోకు ధరల ఆధారిత(డబ్లుపిఐ) ద్రవ్యోల్బణం 4.73 శాతానికి తగ్గగా, ఇది రెండేళ్ల కనిష్టానికి చేరుకునింది. అంతకుముందు డిసెంబర్‌లో ఇది 4.95 శాతంగా ఉంది. 2022 జనవరిలో టోకు ద్రవ్యోల్బణం 13.68 శాతంగా ఉంది. 2021 ఫిబ్రవరిలో ఇది 4.83 శాతంగా ఉంది.

అంటే 2022 జనవరిలో ఇది 24 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. మినరల్ ఆయిల్, రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, వస్త్రాలు, ముడి పెట్రోలియం, సహజ వాయువు ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.52 శాతానికి పెరిగింది. ఇది మూడు నెలల గరిష్ట స్థాయికి చేరింది. కూరగాయల ద్రవ్యోల్బణం -35.95 శాతం నుంచి -26.48 శాతానికి పెరిగింది. గుడ్లు, మాంసం, చేపల ద్రవ్యోల్బణం 3.34 శాతం నుంచి 2.23 శాతానికి తగ్గింది. ఉల్లి ద్రవ్యోల్బణం -25.97 నుంచి -25.20 శాతానికి పెరిగింది. ఇంధనం డబ్లుపిఐ 18.09 శాతం నుండి 15.15 శాతానికి క్షీణించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News