Saturday, November 2, 2024

కొనుగోళ్ల వైపే ఇన్వెస్టర్లు

- Advertisement -
- Advertisement -

Sensex rose 639 points last week

గతవారం 639 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఒడిదుడుకులను చూస్తున్నప్పటికీ మార్కెట్లు లాభాల చూస్తున్నాయి. గత రెండు వారాలుగా మార్కెట్లు స్వల్పంగా పెరిగాయి. గతవారం ఐదు రోజుల్లో సెన్సెక్స్ మొత్తంగా 639 పాయింట్లు పెరిగింది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం వల్ల మార్కెట్లలో ఉత్సాహం కనిపిస్తోంది. మరోవైపు మూడీస్ వంటి గ్లోబల్ రేటింగ్ సంస్థలు భారత్ వృద్ధికి అంతర్జాతీయ అంశాల ప్రభావం అంతగా ఉండదని చెప్పడం సానుకూలంగా మారింది. భారత సార్వభౌమ రేటింగ్‌ను ‘బిఎఎ3’తో నిలకడ దృక్పథాన్ని కల్గివుంటుందని రేటింగ్ సంస్థ తెలిపింది. అత్యధిక స్థాయిలో వృద్ధి సామర్థంతో అతిపెద్ద, విభిన్న ఆర్థిక వ్యవస్థ, ఇంకా బాహ్యంగా బలమైన స్థానం, ప్రభుత్వానికి నిలకడ ఆర్థిక సామర్థంతో పాటు వివిధ అంశాలు భారత్‌కు సానుకూలంగా ఉన్నాయి. రష్యాఉక్రెయిన్ యుద్ధం, అత్యధిక ద్రవ్యోల్బణం, కఠినంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులతో పాటు ఇతర అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ, ఇవేమీ కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న భారత్‌ను ఆపలేవని రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది.

వారాంతం శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 105 పాయింట్లు లాభపడి 59,793 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ కీలక 17,800 పాయింట్ల మార్క్‌ను చేరుకుంది. ఆఖరికి 34.60 పాయింట్లు పెరిగి 17,833 పాయింట్ల వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. ప్రధానంగా టెక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, మారుతీ సుజుకీ, ఎస్‌బిఐ, టిసిఎస్ లాభపడ్డాయి. మరోవైపు గోద్రెజ్ ఇండస్ట్రీస్, ఆస్ట్రాల్, బజాజ్ హోల్డింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, ఆల్ కార్గో లాజిస్టిక్స్, నజారా టెక్నాలజీస్, స్టోవ్ కార్ప్ కూడా పెరిగాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటి ఇండెక్స్ అత్యధికంగా 2 శాతం జంప్ చేసింది. వరుసగా రెండు రోజులు నష్టపోయిన మార్కెట్లు గురువారం నాడు పుంజుకున్నాయి.

క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, ప్రభుత్వ బాండ్ ఈల్డ్ వంటివి ఈక్వీట మార్కెట్లకు సానుకూలంగా మారాయి. సెన్సెక్స్ 659 పాయింట్లు పెరిగి 59,688 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 174 పాయింట్లు లాభపడి 17,798 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 17,800 పాయింట్ల మార్క్‌కు చేరువ అవుతోంది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 25 షేర్లు లాభాలో ముగియగా, 5 స్టాక్స్ మాత్రమే నష్టపోయాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్లలో కొనుగోళ్ల కారణంగా మార్కెట్ బుల్లిష్‌గా కొనసాగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా అప్‌ట్రెండ్‌ను చూసింది. బ్యాంకింగ్‌తో పాటు ఐటి, ఆటో, ఎఫ్‌ఎంసిజి, ఇంధనం, చమురు, గ్యాస్ రంగాలు పెరిగాయి. అదే సమయంలో మెటల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మాతోపాటు మీడియా రంగ షేర్లలో క్షీణత కనిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News