- Advertisement -
ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు మళ్లీ నష్టాల్లో ముగిశాయి. బుధవారం సూచీలు తీవ్ర ఒడిదుడుకులను చూశాయి. సెన్సెక్స్ 323 పాయింట్లు పడిపోయి 58,340 వద్ద ముగిసింది. ప్రభుత్వ కంపెనీల షేర్లు పెరిగాయి. పేటీఎం షేరు 17 శాతం లాభపడింది. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 22 స్టాక్స్ నష్టపోగా, 8 షేర్లు లాభాలతో ముగిశాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ భారీగా లాభపడగా, మారుతీ, ఇన్ఫోసిస్ షేర్లు పతనమయ్యాయి. రిలయన్స్ 1.48 శాతం నష్టపోగా, టెక్ మహీంద్రా, నెస్లే, టాటా స్టీల్ కూడా డౌన్ అయ్యాయి.
- Advertisement -