Wednesday, January 22, 2025

నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ వేసిన మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ మార్కెట్లు నేడు నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ వేశాయి. ఉదయం సూచీలు ఫ్లాట్‌గానే ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్వల్ప లాభాల స్వీకరణ జరిగింది. అయితే గుజరాత్‌లో బిజెపి విజయం ఖరారు కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకుని చివరికి లాభాల్లోనే ముగిశాయి. నిఫ్టీ ఫిఫ్టీ 48.85 పాయింట్లు లేక 0.26 శాతం పెరిగి 18609.35 వద్ద, బిఎస్‌ఈ సెన్సెక్స్ 160.00 పాయింట్లు లేక 0.26 శాతం పెరిగి 62570.68 వద్ద ముగిసింది. నిఫ్టీలో టాప్ గెయినర్లుగా యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, లార్సెన్, ఐషెర్ మోటార్స్, హిందాల్కో నిలువగా, ప్రధానంగా నష్టపోయిన వాట్లో సన్‌ఫార్మా, దివీస్ లాబ్స్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టిసిఎస్, ఎన్‌టిపిసి ఉన్నాయి. అమెరికా డాలరుతో పోల్చినప్పుడు రూపాయి మారకం విలువ 0.06 పైసలు క్షీణించి రూ.82.42 వద్ద స్థిరపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News