Monday, December 23, 2024

స్టాక్ మార్కెట్‌లో ఎనిమిది రోజుల దూకుడుకు బ్రేక్

- Advertisement -
- Advertisement -

ముంబై: ఎనిమిది రోజులపాటు వరుసగా పెరిగిన స్టాక్ మార్కెట్‌కు నేడు బ్రేక్ పడింది. వారాంతంలో లాభాల స్వీకరణ భారీగా జరిగింది. దాంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 415.69 పాయింట్లు లేక 0.66 శాతం పతనమై 62868.50 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 116.40 పాయింట్లు లేక 0.62 శాతం పతనమై 18696.10 వద్ద ముగిసింది. దాదాపు 1995 షేర్లు లాభపడగా, 1376 షేర్లు నష్టపోయాయి. 137 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా ముగిశాయి.

నిఫ్టీలో ఐషెర్ మోటార్స్, ఎం అండ్ ఎం, టాటా కన్జూమర్ ప్రొడక్ట్, హెచ్‌యూఎల్, హీరో మోటో కార్ప్ నష్టపోగా, అపోలో హాస్పిటల్స్, గ్రాసిమ్ ఇండ స్ట్రీస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నష్టపోయాయి. రంగాల వారీగా చూసనట్లయితే రియాల్టీ, మెటల్ తప్పించి అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 81.31 వద్ద ముగిసింది.ఇది గత రోజు రూ. 81.21గా ఉండింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News