Thursday, January 23, 2025

చివరికి లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్!

- Advertisement -
- Advertisement -

ముంబై: భారతీయ స్టాక్ మార్కెట్ నేడు(సోమవారం) చాలా హెచ్చుతగ్గులకు లోనైంది. రోజంతా చాలా సేపు ఫ్లాట్‌గానే చలించింది. కానీ చివరి గంటల్లో కొనుగోళ్లు జరిగాయి. ముఖ్యంగా ఆటో, పిఎస్‌యూ బ్యాంకింగ్‌లో కొనుగోళ్లు జరిగాయి. ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించాలని(కోత) నిర్ణయం తీసుకోవడంతో ప్రపంచ మార్కెట్‌లో చాలా వరకు నెగటివ్ పోకడే కనిపించింది.

నేడు నిఫ్టీ 38.30 పాయింట్లు లేక 0.22 శాతం పెరిగి 17398.05 వద్ద, బిఎస్‌ఈ సెన్సెక్స్ 114.92 పాయింట్లు లేక 0.19 శాతం పెరిగి 59106.44 వద్ద ముగిసింది. మార్కెట్‌లో డౌన్‌సైడ్ ఒత్తిడి తగ్గింది. దాంతో ఆటో స్టాక్‌లలో ర్యాలీ కనిపించింది. అనుకున్న దానికంటే ఇండియా తయారీ పిఎంఐ పెరిగింది. కొత్త ఆర్డర్లతో మూడు నెలల గ్రోత్ రేట్ పెరిగింది. ఆఖరి గంటన్నరలో వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పుంజుకుని లాభాల్లోకి ఎగబాకాయి. ఆటో, ఆర్థిక రంగ షేర్లలో వచ్చిన ర్యాలీ సూచీలకు ఆఖర్లో దన్నుగా నిలిచింది. అదానీ స్టాకులు 5 శాతం మేరకు నష్టపోయాయి. ఎనిమిది కౌంటర్లు రెడ్‌లోనే ముగిశాయి. ఏప్రిల్ నెలలో స్టాక్ మార్కెట్ ‘మేక్ లేక బ్రేక్’ అనే స్థితిలో ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. నిఫ్టీలో హిరో మోటార్ కార్పొరేషన్, కోల్ ఇండియా లిమిటెడ్, బజాజ్ ఆటో, మారుతి సుజుకీ షేర్లు ప్రధానంగా లాభపడగా, బిపిసిఎల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అప్పోలో హాస్పిటల్, ఐటిసి షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అమెరికా డాలరుతో పోల్చినప్పుడు రూపాయి 0.15 పైసలు పెరిగి రూ. 82.33 వద్ద ట్రేడయింది. ఇక బంగారం రూ. 29.00 నష్టపోయి 59373.00 వద్ద ట్రేడయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News