- Advertisement -
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు సోమవారం బారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. వెయ్యి పాయింట్లకు పైగా సెన్సెక్స్ లాభపడింది. 300 పాయింట్లకుపైగా నిఫ్టీ లాభంలో దూసుకుపోతుంది. ప్రస్తుతం నిఫ్టీ 17వేల మార్క్ పైన ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో బుల్ జోరు కొనసాగిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రేపటి కేంద్ర బడ్జెట్ ప్రజెంటేషన్‌ను దృష్టిలో ఉంచుకుని అన్ని రంగాల్లో కొనుగోళ్లకు దారితీసిన ఓపెనింగ్ డీల్స్‌లో సోమవారం భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు భారీగా ట్రేడయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సమర్పించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయానికి సెన్సెక్స్ 1,015 పాయింట్లు( 1.77) శాతం పెరిగి 58,215 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 300 పాయింట్లు (1.76) శాతం పెరిగి 17,402 వద్దకు చేరింది
- Advertisement -