Wednesday, January 22, 2025

యు-టర్న్ తీసుకున్న స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు(మే 3న) స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతోనే ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ అయితే కొత్త రికార్డు స్థాయిని కూడా తాకింది. కానీ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్ డిఎఫ్ సి బ్యాంక్, ఐటి స్టాకులు సూచీలను కిందికి దించేశాయి.

సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు నష్టపోయి 7400 స్థాయికి దిగువన ట్రేడ్ అయింది. ఇక నిఫ్టీ 50 అయితే 150 పాయింట్ల మేరకు పతనమై 22500 కింద ట్రేడయింది. మొదట్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ 1 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.5 శాతం  లాభంతో ఓపెనయింది. కాగా ఆటో, మీడియా, మెటల్, ఫార్మా, రియాల్టీ రంగాలు లాభాలతోనే ఓపెన్ అయ్యాయి. భారత రిజర్వు బ్యాంకు లెండింగ్ ప్రొడక్ట్స్ పై ఆంక్షలు తొలగించడంతో మార్కెట్ తెరచుకోగానే  బజాజ్ ఫైనాన్స్ 6 శాతంకు పైగా గరిష్ఠ స్థాయికి చేరుకుంది. కానీ తర్వాత క్రమంగా హెచ్చు నుంచి తగ్గిపోయింది. సెన్సెక్స్ లో కొంత సేపు అదే టాప్ గెయినర్ గా ఉండింది.

ఇది రాసే సమయానికి సెన్సెక్స్ 950.10 పాయింట్లు పడిపోయి 73684.27 వద్ద, నిఫ్టీ 242.30 పాయింట్లు పడిపోయి 22405.90 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది.

టాప్ గెయినర్స్ లో కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్ జిసి, గ్రాసిమ్ షేర్లు ఉండగా, రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్, ఎల్ అండ్ టి, మారుతి సుజుకీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News