Sunday, January 19, 2025

వరుసగా మూడో వారం నష్టాలు

- Advertisement -
- Advertisement -

గతవారం సెన్సెక్స్ 499 పాయింట్లు పతనం
(మార్కెట్ సమీక్ష)

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను చూస్తున్నాయి. వరుసగా మూడో వారం నష్టాలతో ముగిశాయి. గత వారం రోజుల్లో సెన్సెక్స్ మొత్తంగా 499.32 పాయింట్లు పడిపోయింది. గత వారాంతం శుక్రవారం ఫైనాన్షియల్స్, కన్జూమర్ స్టాక్స్‌లో నష్టాల వల్ల మార్కెట్లు కుదేలయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 0.59 శాతం నష్టపోయి 19,428 పాయింట్ల దిగువకు చేరింది. ఇక సెన్సెక్స్ 0.56 శాతం పడిపోయి 65,322.65 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం నిఫ్టీ 50 దాదాపు 0.45 శాతం పడిపోగా, ఆఖరి రెండు సేషన్లలో అత్యధికంగా 1.04 శాతం నష్టపోయింది.

Also Read: బీమారంలో కిడ్నాప్ కలకలం

ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) రేటు నిర్ణయం తర్వాత మార్కెట్లలో నిరాశ కనిపిస్తోంది. కీలక రంగాల సూచీలు 0.87 శాతం ఫైనాన్షియల్స్ నష్టాలను చూశాయి. పండగ సీజన్, అడ్వాన్స్ టాక్స్ వసూళ్లతో ద్రవ్యలభ్యత పరంగా ఆగస్టు, సెప్టెంబర్ కఠిన నెలలుగా ఉంటాయని నోమురా విశ్లేషకుడు వెల్లడించారు. కఠినమైన అంటే టోకు ఆర్థిక సంస్థలపై తాత్కాలికంగా ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆయన తెలిపారు.

మరోవైపు ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ద్రవ్యోల్బణంపై కూడా ఆందోళన వ్యక్తం చేయడం, ఇతర అంశాలను గమనించిన తర్వాత మార్కెట్‌లో కన్జూమర్ స్టాక్స్ 0.73 శాతం మేరకు నష్టపోయాయి. సమీప భవిష్యత్ ద్రవ్యోల్బణం పెరగవచ్చని ఆర్‌బిఐ సంకేతాలు ఇచ్చింది. అంతేకాదు ద్రవ్యోల్బణం అంచనాను స్వల్పంగా 5.4 శాతానికి పెంచింది. దీర్ఘకాలానికి ఇప్పటికీ అధిక రేట్లు కొనసాగవచ్చు, వచ్చే ఏడాదిలో ఏమైనా తగ్గింపు ఉండే అవకాశముంది. అయితే స్టాక్స్ పతనం అయినప్పుడు ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరిపి క్షీణతను సద్వినియోగం చేసుకోవాలని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News