Wednesday, January 22, 2025

రూ.18 లక్షల కోట్ల నష్టం

- Advertisement -
- Advertisement -

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 900, నిఫ్టీ 264 పాయింట్లు పతనం
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రభావమే కారణం

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస నష్టాలతో ఇన్వెస్టర్లకు వణుకు పుట్టిస్తున్నాయి. గత ఆరు రోజులుగా మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కారణంగా భారతీయ స్టాక్‌మార్కెట్లో అమ్మకాలు కొనసాగాయి. ఈ యుద్ధం కారణంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరగ్గా, చమురు ధరలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ వంటి అంశాలు కూడా మార్కెట్ ను ప్రభావితం చేశాయి. ఆరు రోజుల ట్రేడింగ్ చూస్తే మార్కెట్లో పె ట్టుబడిదారులు ఇప్పటికే దాదాపు రూ.17.77 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు.

గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ భా రీగా 900.91 పాయింట్ల పతనమైంది. 1.41 శాతం క్షీణతతో సెన్సె క్స్ 63148.15 పాయింట్లకు చేరుకుంది. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 25 క్షీణించగా, 5 మాత్రమే పెరిగాయి. ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఐటి, మె టల్ షేర్లు అత్యధికంగా పడిపోయాయి. ఇక నిఫ్టీ 264.90 పా యింట్లు అంటే 1.39 శాతం నష్టంతో 18857.25 స్థాయికి పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ 1.29 శాతం అంటే 551.85 పాయింట్లు పడిపోయింది, ఇది ఇప్పుడు 42,280.15 స్థాయికి చేరుకుంది. ప్రధానంగా ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ రంగాలు నష్టపోయిన వాటిలో ముందున్నాయి.

విక్స్ సూచీ కూడా 3.69 శాతంగా ఉంది. గురువారం నాటికి బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీలు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.306 లక్షల కోట్లకు తగ్గిం ది. ఇది అక్టోబర్ 17న రూ.323 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఆరు రోజుల్లో రూ.18 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ముడి చమురు ధరలు మరోసారి పెరుగుతున్నాయి. బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 2 శాతం పెరిగి 90 డాలర్ల పైన ట్రేడవుతోంది. డబ్లుటిఐ క్రూడ్ బ్యారెల్‌కు 85 డాలర్లపైన ఉంది. అదే సమయంలో బంగారం ధరలు మరోసారి 2000 డాలర్లకు చేరుకున్నాయి. ప్రస్తు తం డిసెంబర్ ఫ్యూచర్స్ బంగారం ఔన్సుకు 1,995 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా ఔన్స్‌కు 23 డాలర్లకు పైనే ఉంది.

భారీ నష్టాల్లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు
మార్కెట్‌లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్ల పరిస్థితి అధ్వాన్నంగా మా రింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 1.88 శాతం, స్మాల్ క్యాప్ 2.57 శాతం నష్టపోయాయి. గురువారం ప్రారంభం క్రాష్ తర్వాత పెట్టుబడిదారుల సంపద ఒక్కసారిగా రూ.5 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది.

ఐఆర్‌ఎం ఎనర్జీ లిస్టింగ్
ఐఆర్‌ఎం ఎనర్జీ స్టాక్ మార్కెట్‌లో బలహీనమైన లిస్టింగ్ కంపెనీ షేర్లు ఇష్యూ ధర నుండి 5.5 తగ్గింపుతో ఎన్‌ఎస్‌ఇలో రూ.477.25 వద్ద లిస్ట్ అయ్యాయి. దీని తరువాత దాని షేర్లలో మరింత క్షీణత కనిపించగా, ఇది రూ. 31.85 (6.31%) పడిపోయి 473.15 వద్ద ముగిసింది. దీని ఐపిఒ ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ.505గా

అమెరికా మార్కెట్లు 2% పతనం
బుధవారం అమెరికా మార్కెట్లపై విపరీతమైన ఒత్తిడి నెలకొంది. డౌజోన్స్105 పాయింట్లు నష్టపోయింది, కానీ నాస్డాక్ 319 పాయింట్ల (-2.43%) పెద్ద క్షీణతను చూసింది. ఎస్ అండ్ పి500 కూడా 1.43 శాతం నష్టపోయింది. నాస్‌డాక్, ఎస్ అండ్ పి500 రెండూ ఇప్పుడు 5 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.

మార్కెట్ పతనానికి కారణాలివే..
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం కారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ కారణంగానే ఇన్వెస్టర్లు మార్కెట్ నుండి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. అమెరికా డాలర్ బలపడటంతో మార్కెట్ ఒత్తిడిలో కొనసాగుతోంది.
ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా మార్కెట్ పతనమవుతోంది. గత కొద్ది రోజులుగా విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) మార్కెట్ నుం చి డబ్బును ఉపసంహరించుకుంటున్నారు. వీరు ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు పెంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News