Thursday, January 23, 2025

ఐటీ, బ్యాంకింగ్ షేర్ల అమ్మకాలతో 483 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

- Advertisement -
- Advertisement -

Sensex

ముంబయి: గ్లోబల్ ఈక్విటీలలో నష్టాల కారణంగా  ఐటి, క్యాపిటల్ గూడ్స్,  బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో  సెన్సెక్స్ దాదాపు 483 పాయింట్లు పడిపోయింది.  బెంచ్‌మార్క్ స్టాక్ సూచీలు సోమవారం మందకొడిగా ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 482.61 పాయింట్లు లేదా 0.81 శాతం తగ్గి 58,964.57 వద్ద స్థిరపడింది. రోజులో, ఇది 552.78 పాయింట్లు లేదా 0.92% క్షీణించి 58,894.40 వద్దకు చేరుకుంది.

నిఫ్టీ-50లో  29 స్టాక్‌లు క్షీణించడంతో 109.40 పాయింట్లు లేదా 0.62% క్షీణించి 17,674.95 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ప్యాక్ లో  లార్సెన్ అండ్ టూబ్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, విప్రో, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ప్రధానంగా నష్టపోయాయి. దీనికి విరుద్ధంగా, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్‌టిపిసి, కోటక్ మహీంద్రా బ్యాంక్, టిసిఎస్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభపడ్డాయి.

టిసిఎస్ తన ఆర్థిక ఫలితాలను ఈ రోజు తర్వాత ప్రకటించనుంది. ద్రవ్యోల్బణంపై ఆందోళనలు, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ దూకుడు రేట్ల పెంపు అంచనాలు,  భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా బలహీన వృద్ధి కారణంగా గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కూడా క్షీణించాయి. ఇదిలావుండగా రాబోయే సమావేశాల్లో బెంచ్‌మార్క్ రేటును సాధారణ మొత్తానికి రెండింతలు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు యుఎస్ ఫెడ్ అధికారులు సూచించారు.  ఫెడ్ యొక్క బాండ్ హోల్డింగ్‌లను కుదించవచ్చని కూడా వారు సూచించారు, ఇది వాణిజ్య రుణ రేట్లను పెంచవచ్చు.

ఆసియాలో హాంకాంగ్, సియోల్, షాంఘై, టోక్యో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. టెక్నాలజీ స్టాక్స్‌లో అమ్మకాల కారణంగా యూరోపియన్ స్టాక్ మార్కెట్లు కూడా దిగువన ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 2.38% క్షీణించి 100.3 డాలర్లకు చేరుకుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం నాడు రూ. 575.04 కోట్ల విలువైన షేర్లను ఆఫ్‌లోడ్ చేయడం కొనసాగించారని ఎక్స్ఛేంజ్ డేటా పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News