Sunday, November 3, 2024

ఇన్వెస్టర్ల సంపద

- Advertisement -
- Advertisement -
Sensex up 817 points
రూ.11 లక్షల కోట్లు జంప్..
మార్కెట్లకు ఫలితాల జోష్
817 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల జోష్ మార్కెట్లో కనిపించింది. రష్యాఉక్రెయిన్ సంక్షోభం కారణంగా కొద్ది రోజులుగా నష్టాలను చూసిన మార్కెట్లు మళ్లీ లాభాల బాటపట్టాయి. వరుసగా మూడో రోజు మార్కెట్ సూచీలు దూకుడు చూపాయి. గురువారం సెన్సెక్స్ 817 పాయింట్లు పెరిగి 55,464 పాయింట్లకు చేరింది. మూడు రోజుల్లో మొత్తంగా సెన్సెక్స్ 2,621 పాయింట్లు పెరిగింది. ఇక నిఫ్టీ 249 పాయింట్లు లాభపడి 16,594 పాయింట్ల మార్క్‌ను చేరుకుంది. అయితే ఈ మూడు రోజులు ఇన్వెస్టర్ల సంపద రూ.10.83 లక్షల కోట్లు పెరిగింది. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడు సెషన్లలో రూ.10.83 లక్షల కోట్లు పెరిగి రూ.251.93 లక్షల కోట్లకు చేరింది. ఈక్విటీ99 ప్రతినిధి రాహుల్ శర్మ మాట్లాడుతూ, మార్కెట్లు గురువారం ముఖ్యంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఆధారంగా ముందుకు సాగాయని అన్నారు.

అయితే మార్కెట్ అనంతరం రష్యా, ఉక్రెయిన్ చర్చలు జరగ్గా, వీటి ప్రభావం శుక్రవారం సెషన్‌లో కనిపిస్తుందని ఆయన అన్నారు. సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో ముఖ్యంగా హిందుస్తాన్ యునిలివర్, టాటా స్టీల్, ఎస్‌బిఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, నెస్లే, మారుతీ సుజుకీ భారీ లాభాలను చూశాయి. ఈ స్టాక్స్ 5 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు టెక్ మహీంద్రా, రా.రెడ్డీస్ ల్యాబ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నష్టాలను చవిచూశాయి. టెక్నికల్ అనలిస్ట్ బొనాంజా పోర్ట్‌ఫోలియో హర్ష్ పరేఖ్ మాట్లాడుతూ, ఎన్నికలపై దృష్టిపెట్టిన ఇన్వెస్టర్లు ఒడిదుడుకుల నేపథ్యంలో మంచి లాభాలను చూశాయి. ఎన్నికల ఫలితాలతో సూచీలు లాభాల పరుగు తీశాయి. బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీలు 1.18 శాతం వరకు పెరిగాయి. రంగాల వారీగా చూస్తే ఎఫ్‌ఎంసిజి, రియాల్టీ, మెటల్, బ్యాంక్ సెక్టార్లు భారీ లాభాలను చూశాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ 5.11 శాతం పెరిగి బ్యారెల్ రేటు 116.8 డాలర్లకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News