Sunday, December 22, 2024

అత్యాచారం కేసులో ఇద్దరికి రెండేళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

Sentenced to two years in prison in a rape case

హైదరాబాద్: వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించిన ఇద్దరు నిందితులకు రెండేళ్ల జైలు శిక్ష, రూ. 5,000 జరిమానా విధిస్తూ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం…. సికింద్రాబాద్‌కు చెందిన వృద్ధురాలు(70)కు మద్యం తాగే అలవాటు ఉంది. డిసెంబర్12, 2019 సాయంత్రం 4గంటలకు బాధితురాలు మిర్జాగూడ ఎక్స్ రోడ్డు వద్ద నిల్చుని ఉంది. అదే సమయంలో పెయింటర్‌గా పనిచేస్తున్న చిన్నప్ప ఆంటోని జార్జ్, నేనావత్ విజయ్‌కుమార్ ఇద్దరు చూశారు. ఇద్దరు వృద్ధురాలి మద్యం తాగించి అత్యాచారం చేయాలని ప్లాన్ వేశారు. సమీపంలోని తమ ఇంటికి తీసుకుని వెళ్లారు. అక్కడ బాధితురాలికి మద్యం తాగించారు, అదే సమయంలో ఇద్దరు కలిసి అత్యాచారం చేసేందుకు యత్నించగా వృద్ధురాలు నిరాకరించి, కేకలు వేసింది. చుట్టుపక్కల ఉన్న వారు అక్కడికి వచ్చి కాపాడారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మల్కాజ్‌గిరి పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. కోర్టులో ఛార్జ్‌షీట్ వేసి సాక్షాలను ప్రవేశపెట్టడంతో కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News