Sunday, January 19, 2025

మాజీ నేవీ సిబ్బందికి మరణ శిక్ష

- Advertisement -
- Advertisement -

గూఢచర్యం కేసులో 8మంది అధికారులకు శిక్ష ఖరారు చేసిన ఖతార్  కోర్టు

భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి న్యాయ పోరాటం కొనసాగిస్తామని ప్రకటన

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులకు ఖతర్ కోర్టు గురువారం మరణ శిక్ష విధించింది.గూఢచర్యం ఆరోపణలపై వీరికి మరణ శిక్ష విధించినట్లు తెలుస్తోంది. కాగా ఎనిమిది మంది భారతీయులకు మరణ శిక్ష పడినట్లు వార్తలు రావడంపై భారత విదేశాంగశాఖ స్పందించింది.‘నేవీ మాజీ అధికారులకు మరణ ఖతర్ కోర్టు మరణ శిక్ష విధించిందన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ తీర్పునకు సంబంధించి పూర్తి వివరాల కోసం ఎదురు చూస్తున్నాం. బాధిత కుటుంబ సభ్యులతో పాటుగా న్యాయ బృందాలతో టచ్‌లో ఉన్నాం.చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలకోసం అన్వేషిస్తున్నాం. ఈ కేసుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం. ఈ తీర్పునకు సంబంధించి ఖతర్ అధికారుల దష్టికి తీసుకెళ్తాం’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. గోప్యతకు సంబంధించిన కారణాల దృష్టా ఈ కేసుపై ప్రస్తుతం ఎక్కువగా వ్యాఖ్యానించలేమని తెలిపింది.భారత్‌కు చెందిన ఎనిమిది మంది నేవీ మాజీ అధికారులు అల్ దహ్రా కంపెనీలో పని చేస్తున్నారు.

ఖతర్ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్‌కు చెందిన ఓ మాజీ వైమానిక దళ అధికారి నిర్వహిస్తున్నారు.అయితే భారత్‌కు చెందిన ఈ ఎనిమిది మందిని ఖతర్ అధికారులు గత ఏడాది ఆగస్టులో నిర్బంధంలోకి తీసుకున్నారు. సబ్ మెరైన్ కార్యకలాపాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో వీరిని నిర్బంధించినట్లు తెలుస్తోంది. అయితే వీరంతా భారత అధికారులతో మాట్లాడేందుకు ఖతర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో భారత విదేశాంగ శాఖ అధికారులు వీరిని కలవడంతో పాటుగా ఖతర్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. అదే సమయంలో పలుమార్లు బెయిలు కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వీరి నిర్బంధాన్ని ఖతర్ ప్రభుత్వం పొడిగించింది. చివరికి గత ఏప్రిల్‌లో ఈ కేసు కోర్టులో విచారణకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఎనిమిది మందికి తాజాగా అక్కడి ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు మరణ శిక్ష విధించింది. మరణ శిక్ష పడిన వారిలో కెప్టెన్ నవ్‌తేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేశ్ ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News